తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సింగపూర్ కు చెందిన వ్యాపార ,వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగ అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహాకారాలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నిన్న మంగళవారం మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిశ్రమలు,ఐటీ కంపెనీల ఏర్పాటుకు ,పారిశ్రామిక రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను మంత్రి కేటీఆర్ వివరించారు.సింగపూర్,తెలంగాణ మధ్య వ్యాపార ,వాణిజ్య సంబంధాల బలోపేతానికి అవసరమైన సహయ సహాకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఐటీ,ఫార్మా,అర్భన్ ఇన్ ఫ్రాస్ట్రక్షన్ ,టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి సహాకారం అందిస్తామని కాన్సుల్ జనరల్ ప్రతిపాదించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత ఫార్మాక్లస్టర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ ఫార్మాసిటీ కోసం సింగపూర్ కు చెందిన సర్బాన్ జరోంగ్ మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నదని ఆయన తెలిపారు. కాలుష్య రహితంగా ఫార్మాసిటీ ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఇందుకు సింగపూర్ లాంటి అనుభవమున్న దేశాల సహాయాన్ని వినియోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.