అసాధారణమైన బౌలర్స్ ను వెతకడంలో శ్రీలంక తర్వాతే ఎవరైనా ఎని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ లసిత్ మలింగ నే. అయితే తాజాగా శ్రీలంక నుండే వచ్చింది మరో అద్భుతం. అతడే కెవిన్ కోతిగోడ.. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ 21ఏళ్ల కుర్రాడిపైనే పడ్డాయి. ఈ ఆటగాడిని చూస్తే సౌతాఫ్రికా ఫార్మర్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ లానే ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడు బంగ్లా టైగర్స్ తరపున అభుధాబి లో జరుగుతున్న టీ10 లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.