కీర్తి సురేశ్ `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసి..ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్గా మారారు. `మహానటి`తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
నటిగా ఈ బ్యూటీ కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆరేళ్లయ్యింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఎమోషనల్ మెసేజ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తనను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. “ఆరేళ్ల క్రితం నటిగా జన్మించాను.
వైవిధ్యమైన పాత్రల్లో నటించే అదృష్టం దక్కింది. మీ ప్రేమాభిమానాలు నాపై చూపించినందుకు థ్యాంక్స్. నేనీ స్థాయిలో ఉండటానికి నా కుటుంబం, నా సన్నిహితులే కారణం అందరికీ థ్యాంక్స్. మీ మీ సీట్లలో మీరు కూర్చోండి మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది“ అని ఆ విడియోలో ఉంది.