తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్ అంశాలపై గౌతమ్ గారు మాట్లాడారు.. భారత దేశంలోనే అతి పొడవైన తీరప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ తీరంలో గ్యాస్,ఆయిల్, పెట్రోలియం వంటి సహజవనరులు భారీగా ఉన్నాయి అని PPT ద్వారా వివరించారు.
కేంద్రం ప్రభుత్వం 2025 సం” కల్లా నిర్ణయించిన GDP లో ( 5 ట్రిలియన్ డాలర్ల )సాధించాలనే లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలన్నదే ధ్యేయంగా ఆంధ్రరాష్ట్రన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెట్టుబడులు తెచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. జగన్ కు ఎన్నో వ్యాపార విలువలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఆయనకు చాలా తెలివితేటలు ఉండడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పట్ల జగన్ పక్కా ప్లాన్ తో కృతనిశ్చయంతో ఉన్నారని మేకపాటి అన్నారు.