మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8 కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కూడా ఇదే రేటుకు ముందుకొచ్చింది.దీనితో మరో 6 నెలల్లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్ తక్కువ ధరకే వస్తోంది. చంద్రబాబు హయాంలో మాత్రం సౌర విధ్యుత్ యూనిట్ 5 రూపాయాల చొప్పున వచ్చే 25 సం. కొంటామని తనకు కావాల్సిన మనుషులతో ఒప్పందం చేసుకున్నాడు. దీనివల్ల ఏటా 2 వేలకోట్ల వరకు నష్టం రాష్ట్రానికి..అంటే 25 సం లకు 50 వేల కోట్లు ఇందులో చినబాబు కూడా భారీ ఎత్తున వాటాలు మింగారని సమాచారం.
Home / ANDHRAPRADESH / మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !
Tags ap Chandrababu jagan politics tdp ysrcp