తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
తక్కువ ధరకే నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
అన్ని సేవలు ఒకే చోట ఉండడం వలను ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు ఆయన. దాదాపు అన్ని విభాగాల సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానందతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.