తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆరవై ఆరు మినీ గురుకులాలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
ఇందుకోసం రూ.303కోట్లను కూడా కేటాయించాలని కూడా విన్నవించారు. అంతే కాకుండా ఎస్సీల విద్యా,ఉపాధి కార్యక్రమాలకు రూ.952కోట్లు కేటాయించాలని కూడా మంత్రి కొప్పుల సూచించారు.