సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి.
అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి సోషల్ మీడియా.. ప్రింట్ మీడియా .. ఎలక్ట్రానిక్ మీడియా.. మాధ్యమం ఏదైన సరే సమంత దంపతులు ఎప్పుడు పిల్లలకు జన్మిస్తారని చర్చలు. తమపై వస్తోన్న వార్తలకు స్పందించింది సమంత. వీటి గురించి ఈ అందాల రాక్షసి మాట్లాడుతూ” వివాహమైన ఏ అమ్మాయికైన సరే తప్పకుండా ఎదురై ప్రశ్నల్లో ఒకటి ..
తల్లి ఎప్పుడవుతావు…?. పిల్లలను ఎప్పుడు కంటావు”అనే అమ్మడు చాలా కోపంతో తెలిపింది. అయితే తాజాగా సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ నేరుగా అడిగారు… “మీ చిన్నారి ఎప్పుడు వస్తాడు?” అని! అందుకు బదులుగా సమంత ‘‘నా శరీరంలో చాలా ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేను మీకు చెబుతాను. ఆగస్ట్ ఏడో తారీఖున… ఏడు గంటలకు… 2022లో నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా. అంతే!’’ అని సమాధానమిచ్చారు.