ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ప్రధాన కార్యాలయంగా జగన్ మంత్రి వర్గం తో కలిసి పనిచేస్తున్నారు.. తాజాగా మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత జగన్ మందులతో ప్రత్యేకించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని పూర్తిగా నిర్మూలించి గలిగామని అన్నారట.. అయితే చాలా మంది అధికారులు ఇంకా అవినీతి ఎక్కువగా ఉందని.. అధికారుల అవినీతి వల్ల ప్రభుత్వంపై ఎటువంటి కరప్షన్ ముద్ర రాకూడదు అన్నారట.. పై స్థాయిలో మనం ఎంత చేసిన కిందిస్థాయిలో కచ్చితంగా అవినీతి నిర్మూలన జరిగితేనే ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందని జగన్ చెప్పారట. ఇదే విషయం పై జగన్ కాస్త సీరియస్ కూడా అయ్యారట.. కొంతమంది మంత్రులు ప్రస్తుతం వరకు అవినీతి చేయకపోయినా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన అనుచరుల ద్వారా కొన్ని కార్యకలాపాలు చేస్తున్నట్టు తనకు తెలిసిందని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఉపేక్షించనని చెప్పారట.