మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ విషయంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. “కిరసనాయిలు మాటలు, రాతలు చూస్తుంటే ఆయనకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్టు లేదు.చంద్రబాబు పతనంతోనే అక్రమార్జన నిలిచి పోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్ కంట్రోల్ తప్పినట్టుంది. ఇంగ్లీష్ మీడియం మతం మార్చటానికట! పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు” అని మండిపడ్డారు.