ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీలో అరెస్ట్ అయి గత రెండు నెలలుగా ఏలూరు జైల్లో ఉన్న వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, దుగ్గిరాల గ్రామంలో చింతమనేనిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామార్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. పనిలో పనిగా రౌడీ షీట్తో పాటు 62 కేసులు ఉన్న చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకే స్ఫూర్తి అని, ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.. ఏంటీ చంద్రబాబు చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలా..మహిళ అని కూడా చూడకుండా..ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టినందుకు చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలా..పదవులు, రాజకీయాలు మాకు..మీకెందుకురా అంటూ దళితులని కించపర్చినందుకుకా..భూకబ్జాలను అడ్డుకున్నందుకు దళితులను కులం పేరుతో దూషించి దాడి చేసినందుకా..62 కేసుల్లో ముద్దాయిగా కోర్టులో బోను ముందు నిలబడినందుకా..రెండు నెలలు జైల్లో చిప్పకూడు తిన్నందుకా..దేనికి చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలి..నీకసలు సిగ్గుందా చంద్రబాబు అంటూ దెందులూరు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబయ్య చౌదరి మండిపడ్డారు. చింతమనేనిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు అంటున్నారని.. అయితే ఆయనపై ఉన్న కేసులన్నీ మీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసినవి కాదా అని అబ్బయ్యచౌదరి ప్రశ్నించారు. ఇసుక, మట్టి కొల్లగొట్టిన డబ్బును చింతమనేని అప్పజెప్పటం వల్లే ఆయనకు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. చేసిన తప్పులకు రెండు నెలలుగా జైల్లో చిప్పకూడు తినివచ్చిన మీ అనుచరుడిని పరామర్శించే బదులు..ఒక్కసారి చింతమనేని ఆగడాలకు బలైపోయిన బాధిత కుటుంబాలను కూడా కలుసుకుని వారి ఆవేదన కూడా వినాలని చంద్రబాబుకు అబ్బయ్య చౌదరి సూచించారు. మొత్తంగా చింతమనేని ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
