సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కాలేయం సంబంధించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ఈ పనిచేశారని అనుమానిస్తున్నారు.
