గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల దాడి టీడీపీని అతలాకుతలం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వంశీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే వంశీకి మద్దతుగా కొడాలి నాని వంటి వైసీపీ నేతలు బాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఇప్పుడు మరో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భార్య అయిన నన్ను సొంత కుటుంబ సభ్యులే మోసం చేశారని ఆరోపించారు.. పిల్లనిచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తన భర్త ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు తనను పార్టీకి, కుటుంబానికి దూరం చేశారని అన్నారు. ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ నేడు అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలోకి కొత్తగా కుక్కమూతి పిందెలు వచ్చాయని విరుచుకుపడ్డారు. లోకేష్ వంటి అయోగ్యుడిని పార్టీపై చంద్రబాబు బలవంతంగా రుద్దాడని, ఆ కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పార్టీ లీడర‌్‌గా చేశారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన పార్టీకి పప్పు అనిపించుకుంటున్న లోకేష్ నాయకుడా అని టీడీపీలో ఎంతో మంది లోలోపల బాధపడుతున్నారో తమకు తెలుసని ఆమె అన్నారు. ఎన్నికలకు ముందు తనపై కోటి అనే వ్యక్తితో టీడీపీ నేతలు చేయించిన అసత్య ప్రచారంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. ఎన్నికలకు ముందు తన మనవడు అయిన లోకేషే 60 ఏళ్లు దాటినదాన్ని అని కూడా చూడకుండా తనపై భయంకరమైన నింద వేసి అప్రదిష్ట పాల్జేయాలని చూశాడని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నీచానికి పాల్పడని బాబు, లోకేష్‌లు నా బంధువులని ఎలా చెప్పుకుంటాను…నాకు అల్లుడు లేడు..మనవడు లేడు..నాకొద్దు వాళ్లతో బంధుత్వం అంటూ..ఫైర్ అయ్యారు.. ఆ కుక్కమూతి పిందెకు ఏం తెలుసని, పార్టీ లీడర్‌ను చేశారంటూ లోకేష్‌పై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి ఈ కామెంట్స్‌పై నారా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
