వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు సంబంధించి ఓ ట్రస్ట్ ఇటీవల క్యాన్సిల్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అమ్మ పేరు కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే విజయమ్మ అనే పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించిన మాట, ట్రస్ట్ వేదికగా ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం వాస్తవమే.. కానీ ఆ ట్రస్టుకు వైఎస్ విజయమ్మకు ఎటువంటి సంబంధం లేదట. ఈ ట్రస్ట్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన ఓ విజయమ్మ అనే మహిళదిగా తెలుస్తోంది. కాబట్టి ఏదైనా అంశాన్ని ప్రచారం చేసే ముందు తెలుసుకుని చేయాలంటూ వైసీపీ విజ్ఞప్తి చేస్తోంది.
