తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది.
అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న సరికొత్త చిత్రంలో మిథాలీ రాజ్ పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటించనున్నది సమాచారం.
దీనికి సంబంధించిన మిగతా విషయాల గురించి నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతుందని సమాచారం. తాప్సీ కూడా ఈ బయోపిక్ పై ఆసక్తి తెలిపింది అని అనాధికారక సమాచారం. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనున్నది సమాచారం.