వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు.
వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో విండీస్ జట్టు చేతులు ఎత్తేసింది.
టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం ఐదు వికెట్లను కోల్పోయి నలబై ఐదు పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అంజు 2,దీప్తి శర్మ ,రాధ చేరో వికెటును పడగొట్టారు.