వైసీపీ పార్టీ రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప తరువాత కర్నూలే! 2019 ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసి 7 నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి… అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు. భూమా సోదరుడి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైసీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది.మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు.
పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మరికొంతమంది జిల్లాలో రాజకాయాలకు గుడ్ బై చెప్పమోతున్నారని తెలుస్తుంది. ముందు వరుసలో కేయి..కోట్ల ,భూమా ,గౌరు చరితల కుటుంబాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tags bhuma akhila priya gour charitha kurnool TDP Politics