తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, ఏపీ లో జరుగుతున్న పరిపాలన పై ఆంధ్రజ్యోతి పత్రికలో ఎండి వేమూరు రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు పై పెద్దఎత్తున వైసీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తి చాపకింద నీరులా సాగుతోందని, దానికి ముఖ్యమంత్రి జగన్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. అలాగే ఒకవేళ ఇదే కొనసాగితే గతంలో హిందూ మధ్య వివాదం, గొడవలు జరిగినట్లుగా హిందూ, కిృష్టియన్ల మధ్య మత ఘర్షణలు కచ్చితంగా జరుగుతాయని ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసే ప్రయత్నానికి రాధాకృష్ణ కలిగించారు. ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసింది. వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు రాధాకృష్ణ వ్యవహారశైలి ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పత్రికల్లో రాయడం సరికాదని హెచ్చరిస్తున్నారు.
