తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని కేదార్ నాథ్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసీఐ అధికారులతో కల్సి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ”ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని.. ప్రవేశపెట్టని విధంగా పంటపెట్టుబడికి సాయమందించడానికి రైతుబంధు ,రైతన్న మృతి నొందితే ఆ రైతన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రైతు భీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు లాంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ సంవత్సరం వర్షాల వల్ల పోచంపాడ్, స్వర్ణ ప్రాజెక్టు, కడం ,సదర్మాట్ ప్రాజెక్టు లు నిండుకుండాల నిండాయని రైతులకు రెండో పంటకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నిర్మల్ జిల్లా లో 23 కేంద్రాలు ఉండగా నిర్మల్ లో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ కోరిపెల్లి విజయ రాంకిషన్ రెడ్డి, జేసీ భాస్కర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్ రాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మజి రాజెందర్,వైస్ చైర్మన్ కొప్పుల శ్రీధర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్, AD శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సుభాష్ రావు, మల్లికార్జున రెడ్డి,మారుగొండ రాము, గండ్రత్ ఈశ్వర్, గండ్రత్ రమేష్, సీసీఐ అధికారులు హాజరయ్యారు