జగన్ రెడ్డి, అసలు జగన్ ఏ రెడ్డి, జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు, జగన్ తిరుమల ప్రసాదం తింటారా అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓరకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో దుష్టశక్తిగా ముద్రపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలోని క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. వైయస్ కుటుంబం జెరుసలేము కూడా వెళ్లి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే జగన్ హిందూ అయిన క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అయితే జగన్ మతం మారడం గానీ, జగన్ కుటుంబం క్రైస్తవ మతంలో ఉండడం వల్ల కానీ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం కావాలని ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. జగన్ రెండుసార్లు తిరుమల వెళ్లారు పాదయాత్ర అ మొదలుపెట్టే ముందు కూడా కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని హిందూ దేవుళ్లను పూజిస్తారు. ముస్లిం మతం పట్ల కూడా జగన్ భక్తిభావంతో ఉంటారు. ముఖ్యంగా జగన్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అన్ని కులాల సంక్షేమం కోసం పని చేస్తుంటే కావాలని పాలనాపరమైన విమర్శలు చేయడానికి అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఈవిధంగా వ్యవహరిస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది.
