తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు గజ్వేల్ లోని ఇండియన్ బ్యాంకు ప్రారంభించారు.
ఆ తర్వాత దొంతుల ప్రసాద్ గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లకు సంబంధించిన మొత్తం 717 అర్హులైన లబ్ధిదారులకు 7 కోట్ల 9లక్షల 38 వేల 476 రూపాయల చెక్కులను అందజేశారు.
అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆ తర్వాత సింగాటం గ్రామంలో కొత్తగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ప్రారంభించారు.