2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన కెరీర్ ను కూడా పక్కన పెట్టి అడిగారు కదా అని సొంత పార్టీగా భావించి, తన ప్రతిభతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేసి.. రోడ్డు యాక్సిడెంట్ లో దెబ్బలు కూడా తిని, ఎన్నికలు ముగిసిన తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారనేది నగ్నసత్యం. ఇలా పక్కన పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు. తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాగాంగ జూనియర్ ఎన్టీఆర్ పై కూడా వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు అని బాంబ్ పేల్చారు.2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం, తన కెరియర్ పణంగా పెట్టి, ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, కాని ఎన్టీఆర్ ని చంద్రబాబు పక్కనపెట్డారని విమర్శించారు, ఇది అంతా లోకేష్ కోసం అని అన్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విషయం తెలిసి వల్లభనేని వంశీతో ఫోన్లో మాట్లాడారు అని తెలుస్తోంది, పార్టీ గురించి తన గురించి కామెంట్లు ఎందుకు చేశావు అని చర్చించారట. వంశీ పూర్తిగా తన బాధని చెప్పడం పై ఎన్టీఆర్ కూడా ఏమీ అనలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.
