ప్రేమ ప్రస్తుతం యువతీయువకుల మధ్య చిగురించే బంధం. అయితే ఈ ప్రేమను విజయవంతం చేసుకుని ఎంత మంది పెళ్ళి దాకా తీసుకెళ్తున్నారో కానీ దేశంలోనే హాత్యలకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
దేశంలో 28% హాత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.2001లో 36,202 హాత్య కేసులు నమోదయ్యాయి. కానీ 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి.
వ్యక్తిగత కక్షతో చేసే హాత్యలు 4.3% తగ్గాయి. ఆస్తి వివాదాల వల్ల జరిగే హాత్యలు 12% తగ్గాయి. 2017లో 71పరువు హాత్యల కేసులు నమోదయ్యాయి. 2017లో మాత్రం 92కేసులు నమోదు అయినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది.