తెలంగాణ రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల ఇరవై ఏడో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.nac.edu.in వెబ్ సైట్ లో సంప్రదించి తెలుసుకోవచ్చు. ఎంపికయ్యే అభ్యర్థులను జలమండలి చేపట్టే ప్రాజెక్టుల కోసం వినియోగించుకోనున్నారు.
