ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత ఐదు నెలలు నుంచి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి.
తాజాగా ఏపీలో నెలకొన్న అవినీతిని అంతం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి మూలాలు ఎక్కడున్నాయి..?. ఏ ఏ శాఖల్లో ఏ ఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు..?. ఎంత స్థాయిలో అవినీతి జరుగుతుంది. ? అనే పలు అంశాలపై ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల చేత సర్వే చేయించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నివేదిక ఆధారంగా రానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటారు అని ప్రభుత్వ వర్గాలు అంటున్నారు. మరోవైపు ఏసీబీని సైతం బలోపేతం చేస్తూ చట్టంలో పలు కీలకమైన సవరణలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి వెనకడాడు అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.