తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించింది.
దీంతో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులను పట్టించుకోలేదు.
కానీ తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా తాజాగా ఆర్యవైశ్యులకు భూమి కేటాయించడం శుభపరిణామం అని ఆయన అన్నారు.