ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఏలూరు వెళ్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వరుసగా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటానని, పార్టీ తరుపున మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజం పాలన సాగుతోందని, అక్రమంగా కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రౌడీయిజాన్ని సహించనని అన్నారు. అయితే చింతమనేని వంటి నాయకుడిని పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు ఈ విధంగా మాట్లాడడంతో ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. చింతమనేని ఇష్టానుసారంగా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఇలా ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లుగా వీరంగం చేశారు.. చాలా సందర్భాల్లో రౌడీయిజం కూడా చేశారు. అయితే అలాంటి వ్యక్తిని పక్కనే ఉంచుకుని చంద్రబాబు రౌడీయిజం ఒప్పుకోను దుర్మార్గాలను సాధించడం అంటూ మాట్లాడడం టిడిపి కార్యకర్తలకే ఆశ్చర్యం కలిగించింది.
