ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల క్రితం విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలు పారదర్శకత తీసుకువస్తున్నారని. ఇంతకాలం పత్రికలు ఎల్లో మీడియా ఎలా వ్యవహరించిన పనిలేదని రాష్ట్రానికి సంబంధించి పాలసీలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో పత్రికలు, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చట్టపరంగా చర్యలు కచ్చితంగా తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మరి ఇంత దిగజారుడు వ్యాఖ్యలతో పాటు అసత్యాలను అబద్ధాలను ప్రచురిస్తోంది. ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అండతో ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారు. తాజాగా ఇంగ్లీష్ మీడియం విషయంలో నోటికి వచ్చినట్టుగా రాతలు రాసి ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశారు.. అలాగే క్రైస్తవ మత వ్యాప్తి చెందుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రజల పద్య మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ కారణాలతో ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పత్రిక చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత, అంతులేని ఆగ్రహాన్ని మూట కట్టుకున్న ఆంధ్రజ్యోతి పత్రిక ప్రభుత్వం గనుక నిషేధిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రజ్యోతి అనే పత్రిక కనిపించదు అని స్పష్టంగా తెలుస్తోంది.
