తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే మాటపడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న ‘నిత్యకళ్యాణం’ ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్ లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం” అని అన్నారు.
