ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వీరి బాటలోనే మరో ఇద్దరు నేతలు చేరారు. టీడీపీకి కంచుకోటగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నేరెళ్ళ శోభన్ ,విజయవాడ అర్బన్ టీడీపీ ఉపాధ్యక్షుడు కిషోర్ లు ఆ పార్టీకి,పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అయితే తాము వైసీపీలొ చేరుతున్నట్లు వారు తెలిపారు.