సురేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఫిలిమ్ బిజినెస్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన కొత్త సినిమా ఏదైనా సరే గట్టిగా థియేటర్లలో వారం రోజులు కూడా ఆడడం లేదని ఇందులో స్టొరీ ఎంపికలో లోపం మరియు చిన్న సినిమాలు అంటే కష్టం అన్నట్టు మాట్లాడాడు. సాహో, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలు అయితేనే బిజినెస్ బాగుంటుందని అన్నాడు. ఈరోజుల్లో నెట్ ఫ్లెక్స్, అమెజాన్ వచ్చినాక ఎలాంటి కొత్త సినిమా ఐనా అందులోనే చూస్తున్నారని. అతి తక్కువ మంది థియేటర్ కి వస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరోపక్క తన సొంత థియేటర్లకు కరెంటు బిల్లు మరియు వర్కర్స్ కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితని వివరించాడు.