యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా రికార్డులు బ్రేక్ చేసిన స్టొరీ విషయానికి వచ్చేసరికి అంతగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో సోషల్ మీడియా ఫుల్ నెగటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. ఈ సినిమా తరువాత సుజీత్ దర్శకత్వంలో నటించడానికి ఏ హీరో ముందుకు రావడంలేదట. దాంతో ఆయన హీరో శర్వానంద్ తో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతడి తన సినిమాలో చెయ్యమని అడిగాడట. సుజీత్ తెలుగులో తన మొదటి సినిమా రన్ రాజ రన్ శర్వానంద్ తోనే తీయడం జరిగింది.
