ఆమె ఒక స్టార్ హీరోయిన్. రెమ్యూనేషన్ ఎక్కువగా తీసుకునేవారిలో ఆ హీరోయిన్ ఒకరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుస విజయాలతో కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ టాప్ రేంజ్ కు చేరుకున్న టాప్ హీరోయిన్ ఆమె.
ఇంతకూ ఎవరు ఆ హీరోయిన్ ఆలోచిస్తున్నారా.. ఆ హీరోయిన్ నయన తార. నయన తార గత కొంతకాలంగా స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగిపోయిన సంగతి విదితమే.
అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని వార్తలు కూడా తాజాగా వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ న్యూయార్క్ వీధుల్లో విహారిస్తున్నారు. హాలీడే ట్రిప్ లో భాగంగా న్యూయార్క్ కు వెళ్లిన ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు.