శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను రాజకీయాల్లోకి అడుగుపెడతానని అనౌన్స్ చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి పేదవారికి సాయం చెయ్యాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. మరి ఆమె ఎక్కడ అడుగుపెడుతుంది, ఎవరితో ఉంటుందో తెలియాలి మరి.