సాధారణంగా హెల్మెట్ ధర ఎంత ఉంటుంది. మహా ఐతే ఐదు వందల నుండి యాబై వేల రూపాయల వరకు ఉంంతుంది కదా.. అయితే విమానంలో ఆర్మీ పైలట్ ధరించే హెల్మెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా..?. మహా అయితే ఎంత ఉంటుంది ఒక ఇరవై ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది అని అనుకుంటున్నారా..?. అయితే మీరు అనుకున్నది అక్షరాల తప్పు.ఆర్మీ పైలెట్ ధరించే హెల్మెట్ ధర అక్షరాల రూ. లక్ష ఉంటుంది. ఎందుకు అంత ధర ఉంటుంది అని అనుకుంటున్నారా…?. అయితే ఆ హెల్మెట్ ధర లక్ష రూపాయల వరకు ఉండటానికి ప్రధాన కారణముంది. ఆ కారణం ఏమిటంటే విమానంలో ఆర్మీ పైలెట్ ధరించే హెల్మెట్ లో విమానానికి సంబంధించిన అన్ని టెక్నాలజీ అంశాలు దానిలో ఉంటాయి. అయితే అమెరికా ఎఫ్ 35జెట్ ఫైటర్ లో ధరించే హెల్మెట్ ధర ఎంతో తెలిస్తే మీరు అవాక్కవుతారు.దాని ధర అక్షరాల రూ.2.8 కోట్లు ఉంటుంది. ఇంత ధర ఉండటానికి ప్రధాన కారణాలు ఉన్నాయి.. అవి ఏమిటంటే ఈ జెట్ ఫైటర్లో అత్యధిక వేగంతో .. అత్యంత ఎత్తులో ప్రయాణం చేస్తుంటాయి. ఆ వేగంతో.. ఆ ఎత్తులో వెళ్ళే సమయంలో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శరీరానికి రక్తసరఫరా పెద్దగా జరగకపోవడంతో నిర్ణయం తీసుకోవడం ఎదురై సమస్యను అధిగమించడానికి సంబంధించిన టెక్నాలజీ వసతులు ఇందులో ఉంటాయి. అంతేకాదు ఎఫ్ 35జెట్ ఫైటర్ లో మొత్తం ఆరు చోట్ల కెమెరాలున్నాయి. ఈ హెల్మెట్ ద్వారానే చుట్టూ ఉన్న కెమెరాల వ్యూ ఎలా ఉందో తెలుస్తాది.పక్కనుంచి వెళ్లే విమానాలకు సంబంధించిన ఆడియోను కూడా వినే అవకాశం కూడా ఉండటంతో ధర ఇంత మొత్తంలో ఉంటుంది.
