తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు రూ.2000,దుఖాణాల ముందు చెత్తవేస్తే రూ.1000లు జరిమానా వేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
నగరంలో ఏవైనా ప్రారంభోత్సవాల సందర్భంగా ,వేడుకల సందర్భంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్ల వెంట కార్యాలయాల్లో ఫ్లెక్సీలు ,బ్యానర్లు,హోర్డింగులు ఏర్పాటు చేయద్దు అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు.