జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కొంతమంది మోడీని అమిత్ షా ని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు వివరించడానికి అనే చెబుతుంటే అధికారికంగా మాత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత కార్యక్రమానికి వెళితే కూడా నాదెండ్ల మనోహర్ ను ఎందుకు తీసుకు వెళ్లారు ఎవరు చెప్పడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన అక్కడి జర్నలిస్టులను కలిసిన కనీసం ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. ముఖ్యంగా వైసిపి మాత్రం పవన్ కళ్యాణ్ ని పంపింది చంద్రబాబేనని విమర్శిస్తోంది. గతంలో ఆంధ్రజ్యోతి ఎం.డి రాధాకృష్ణను పంపినట్లుగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని పంపి బిజెపి తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాడుకున్నట్టు వైసిపి సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది.