ప్రస్తుతం టెలికాం కంపెనీలో జియో బాట లో ఫ్రీగా డేటా ఇవ్వడంతో అందరూ సెల్ ఫోన్ ను తెగ వాడేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కూడా చౌకగా లభిస్తుండడంతో అందరూ కంప్యూటర్లు ఫోన్లలో పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు దీనికి బానిసగా కూడా మారిపోతున్నారు.. ఈ పోర్న్ చూస్తూ ఉద్రేకం లో అత్యాచారాలు పెరిగి పోతున్నాయని కేంద్రం గుర్తించింది. మృగాళ్లు పోర్న్ మాయలో పడి వావివరసలు మరిచి చిన్న పిల్లల పై కూడా లైంగిక దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగి పోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే దేశంలో పోర్న్ ను అరికట్టాలని.. ముఖ్యంగా చిన్న పిల్లలతో కూడిన నీలి చిత్రాలను అప్ లోడ్ చేస్తున్న వారిని.. వాటిని చూస్తున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని డిసైడ్ అయ్యింది.ఈ మేరకు కేంద్రం లోని సీబీఐ కి బాధ్యతలు అప్పజెప్పింది. బాలలపై లైంగిక దాడుల నివారణ దర్యాప్తు విభాగం (ఓసీఎస్ ఏఈ) పేరిట ఢిల్లీలో దీని కోసం ప్రత్యేక వ్యవస్థ ను టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సీబీఐ స్పెషల్ టీం పోర్న్ చూసేవారు.. అప్ లోడ్ చేసేవారి పని పడుతుంది. చిన్నపిల్లల నీలి చిత్రాలు చూసినా అప్ లోడ్ చేసి గుర్తించి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. వారిపై కఠినమైన పోక్సో చట్టం ఐటీయాక్ట్ కేసులు నమోదు చేస్తుంది. సో పోర్న్ చూసేవారంతా బహుపరాక్. ఆ అలవాటును మానక పోతే జైలు పాలవుతారు జాగ్రత్త.
