ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, నటుడు విజయ్ చందర్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్‌డీసీ చైర్మన్‌గా విజయ్ చందర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని.. కన్న గడ్డ పిలుస్తోందని విజయ చందర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను చేసి చూపెడతానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆర్టీసీ ఆడ్మినిస్ట్రేటివ్ భవన్ లో గల ఎఫ్డీసీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు అనంతరం విజయ్ చందర్ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ ఎండీ, సమాచార-పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించారు.