టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ను డొక్క పగులుద్ది అంటూ చేసిన ఓ టీవీ ఛానల్ డిబెట్‌లో చేసిన వ్యాఖ్యలపై.. గన్నవరం వల్లభనేని వంశీ పశ్చాతాప్తం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న తాను కొంత సంయమనం కోల్పోయిన పెద్దాయనను దూషించడం తప్పునేని ఒప్పుకున్న వంశీ… ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్‌కు క్షమాపణ చెప్పారు. అయితే తనకు బీపీ ఎక్కువ కావడం వల్లనే దూషించాల్సి వచ్చిందన్న ఆయన తాను వాళ్లలాగా బీపీ ట్యాబ్లెట్స్ వాడనని అన్నారు. ఇక అయ్యప్ప మాల వేసుకుని హిందూ ధర్మానికి తుంగలో తొక్కుతున్నానని టీడీపీలోని కొందరు గ్రీకువీరులు, కలుగు వీరులు తనపై విమర్శలు చేస్తున్నారని..కాని తానేమి బెజవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించలేదని, వాళ్లలాగా టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవులు, బోర్టు మెంబర్ పదవులు అమ్ముకోలేదని వంశీ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు ముందు విశాఖ శ్రీ శారదాపీఠానికి వచ్చిన వెళ్లిన తర్వాత, ఎవరెవరు పీఠానికి వెళుతున్నది సీసీ కెమెరాలు పెట్టి చూడలేదని..చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి వంశీ అన్నారు. తాను ఆస్తులను కాపాడుకోవడం కోసమే పార్టీ మారుతున్నట్లు లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ మండిపడ్డారు. పప్పు ఏదో సవాలు చేస్తున్నాడు..ఓకే పప్పు సవాల్ చేసినట్లే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను..అలాగే ఎమ్మెల్సీ పదవికి పప్పు రాజీనామా చేస్తాడా అంటూ లోకేష్‌ను వంశీ ప్రశ్నించాడు. టీడీపీ అనుకుల వెబ్‌సైట్లలో తనమీద లోకేష్ దుష్ప్రచారం చేయిస్తున్నాడని వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు చేసిన వర్లరామయ్య, బచ్చుల అర్జునుడు, పంచుమర్తి అనురాధలను ఉద్దేశిస్తూ …పెయిడ్ ఆర్టిస్టులందరూ వచ్చి తనపై మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా రాజేంద్ర ప్రసాద్ విషయంలో వెనక్కి తగ్గి సారీ చెప్పిన వంశీ.. లోకేష్, ఇతర టీడీపీ నేతలపై మాత్రం తనదైన స్టైల్లో ఉతికి ఆరేశాడు. మరి వంశీ, లోకేష్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరెంత వివాదానికి దారి తీస్తుందో చూడాలి.