ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు వ్యతిరేకిగా మారారు తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు మన పార్టీ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది కూడా లోకేష్ గాని చంద్రబాబు గాని సమాచారం ఇవ్వడం లేదట. రాజీనామా అనే ఒక కండిషన్ కట్టుకుంటే టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మిగలరు అనేది టీడీపీ అధిష్టానం గ్రహించింది. ఇందులో భాగంగా అసలు వంశీ మాదిరిగా ఇంకా ఎంత మంది అసంతృప్తితో ఉన్నారు ఎవరు పార్టీ నిర్ణయానికి లోబడి ఉన్నారు అనే దాని కోసం చంద్రబాబు ఓ కార్యక్రమం పెడితే అసలు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు అనేది కూడా వేసుకున్నారట. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు వస్తే ఆ రెస్పాంస్ ని బట్టి మరిన్ని కార్యక్రమాలు చేయాలని భావించారట. దీనికి ఇసుక దీక్ష సరైనదని భావించిన చంద్రబాబు విజయవాడలో దీక్ష లో కూర్చుంటే ఎనిమిది మందికి పైగా గెలిచిన ఎమ్మెల్యేలు సుమారుగా 30 నుంచి 45 మంది వరకు ఓడిపోయిన ఎమ్మెల్యేలు చంద్రబాబు దీక్షకు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు పెద్ద బాబు చిన్న బాబు మల్లగుల్లాలు పడుతున్నారు.