మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకోస్తామని”అన్నారు.
దీంతో బ్యాంకులు బోర్డు తిప్పేస్తే బీమా మొత్తాన్ని ఖాతాదారులకు అందుతుందని ఆమె తెలిపారు.