గత 7సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ఇంట నవ్వులు పండుతున్నాయంటే అది జబర్దస్త్ షో వల్లనే అని చెప్పాలి. మరోపక్క ఇంట్లో మగవాళ్ళు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి అలసిపోయి వచ్చి మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడవారు ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకొని అలసిపోతారు. అలా ఉన్న వీరికి ఈ షో రాగానే ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్టు ఉంటాది. ఇలా వారి చేసిన స్కిట్ లతో చిన్న పిల్లలు దగ్గరనుండి పెద్దవారి వరకు అందరిని నవ్విస్తూనే వస్తున్నారు. అలాంటి షో కి ఇప్పుడు గడ్డుకాలం ఎదురయ్యిందని చెప్పాలి. ఈ షో డైరెక్టర్స్ మరియు మల్లెమాల మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం. దాంతో ఇలాంటి షో వేరేవాళ్ళతో చెయ్యాలని భావిస్తున్నారట. అంతేకాకుండా నాగబాబు ని కూడా తీసుకెళ్ళే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. అటు టాప్ ఆర్టిస్ట్ లను కూడా ఎక్కువ ఆఫర్ చేసి తీసుకెల్తారట..!