టీమిండియా దిగ్గజ ఆటగాడు,ప్రపంచ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇదే రోజున సరిగ్గా ఆరేళ్ల కింద క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1989లో క్రికెట్లోకి అడుగు పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013 నవంబర్ 16న వాంఖడే మైదానంలో వెస్టిండీస్ పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వీడ్కోలు సందర్భంగా సచిన్ టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు క్రికెట్ లో కొనసాగిన సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మాట్లలో 34,357పరుగులు చేశాడు. వన్డేల్లో 49సెంచురీలు,టెస్టుల్లో 51సెంచురీలు చేశాడు సచిన్.