తన మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని, లేదా మరొకరిని బలి చేయాలనో తెలియదుగానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అస్త్రానికి పవన్ కళ్యాణ్ బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే పథకం పై అనవసర రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ మరింత చులకన అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పెద్ద చదువులు చదివించాలని కోరుకుంటుంది. కానీ ఈ కోరికను తెలుసుకొని సీఎం పథకాన్ని ప్రవేశపెడితే దానికి అడ్డగోలు వాదనలు వాదిస్తూ అలా చేయడానికి కుదరదని పవన్ కళ్యాణ్ వాదిస్తున్నారు. ఇందులో ప్రధాన వాటా చంద్రబాబు అవుతుంది ఎందుకంటే చంద్రబాబు వల్లే పవన్ ఇలా తయారయ్యారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే.. మొత్తంమ్మీద జగన్ ఇంగ్లీష్ మీడియం ట్రాప్లో రెండు ప్రతిపక్షాలు పడ్డాయి అన్నది వాస్తవం.