ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు గా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీపై హై పిచ్ లో విరుచుకుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ లో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నికూడా తూర్పారబట్టారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటూ గాలి మాటలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్‌కు ఇంకా జీవితంలో సిగ్గు రాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు పొంగిన వాగుల్లో ఇసుక తీయడం ఎవరితరం కాదని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ఆ టెక్నాలజీ చెప్పాలన్నారు. వల్లభనేని వంశీ మాత్రం ఇంగ్లీష్ మీడియం బోధన పవన్ కళ్యాణ్ వద్దు అని చెబుతుండడం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్టు రాసి పంపిస్తే పవన్ కళ్యాణ్ బల్లలు చరుస్తూ ఊగిపోతూ ఆవేశంతో మాట్లాడతారని చెప్పుకొచ్చారు. గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే గా తాను నిలబడినప్పుడు జనసేన పార్టీ తరఫున సిపిఎం నుంచి పవన్ కళ్యాణ్ బి ఫారం తనకే ఇచ్చి ఎవరు కావాలో వాళ్ళను పెట్టుకోవాలని, ఇంతకు మించి లాలూచీ రాజకీయం పవన్ కళ్యాణ్ లా ఎవరూ చేయలేరని వంశీ విమర్శించారు.