తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు.
గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
వచ్చే జూన్ నెల లోపు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.