గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మరియు ఆయన పార్టనర్ ఓటమిని సహించలేకపోతున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు కనీసం సీట్లు కూడా గెలుచుకోలేకపోయాడు. అవైనా వచ్చాయి అంటే అది కేవలం చంద్రబాబుని చూసి కాకుండా పార్టీపై అభిమానం ఉన్నవాళ్ళు వేసిన ఓట్ల వల్లే వచ్చాయి. ఇక పవన్ విశయానికి వస్తే ఆయన పోటీ చేసిన ఒక్క చోటైనా గెలిచి ఉంటే ఉన్న కాస్త గౌరవమైన ఉండేది. ఉప్పుడు ఉన్న పరువు మొత్తం పోయింది. వీరిద్దరిపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో చెప్పారు.”నిర్మాణ కార్మికులకు నిజంగా ఉపాధి పోయిందో లేదో కానీ… బాబుకు, ఆయన పార్ట్నర్కు చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లు. రాంగ్ మార్చ్, ఒక్కపూట నిరాహార దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం వెయ్యి కుటుంబాలు ఏడాది కాలం పాటు జీవిస్తాయని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు” అని చెప్పారు.