నారా లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఏమాత్రం తగ్గకుండా మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయం, వణుకు, 104 జ్వరం అని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కు నారా లోకేష్‌కు నక్కకు…నాగాలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయని..లేకుంటే చంద్రబాబు, లోకేష్‌లకు అంత సీన్ లేదని అన్నారు.. లోకేష్ దద్దమ్మ కాబట్టే..అడ్డదారిలో పదవి కట్టబెట్టారని విమర్శించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారని వంశీ అన్నారు.