తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిజాం కాలేజీలో జరుగుతున్న జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రస్తుత స్థితిగతులు – భవిష్యత్ ఉపయోగాలు అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” జీవ సాంకేతిక శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. వీటి ఫలితాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత ఉంటుంది”అని అన్నారు. తమిళ సై ఇంకా మాట్లాడుతూ” నేను వృత్తి రిత్యా నేను వైద్యురాలిని. మెడిసిన్ లో నేను చేరిన మొదటి ఏడాదినే నాకు వివాహమయింది. నా భర్త సౌందరరాజన్ ప్రోత్సహించడంతో మెడిసిన్ పూర్తిచేసుకుని వైద్య విద్యను పూర్తి చేసి మంంచి వైద్యురాలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. అందుకే పెళ్ళి అయిన అమ్మాయిలకు భర్తలు అన్ని రకాలుగా సహాకరించాలని “ఆమె పిలుపునిచ్చారు.గవర్నర్ ఇంకా మాట్లాడుతూ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో మానవ జీవితం జీవ సాంకేతిక శాస్త్రంతో ముడిపడి ఉందని .. అందుకే నూతన పరిశోధనలు.. ఆవిష్కరణలు ఈ సమాజానికి అవసరమని .. ఆదిశగా ప్రోత్సహించాలని” కోరారు.
